VZM: మెరకముడిదాం మండలం మెరకముడిదాం, సోమలింగాపురం, ఎం పాలెం మూడు గ్రామాల గ్రామదేవతైన మెరక తల్లి అమ్మవారు వారోత్సవాలు ఇవాళ నుంచి జరుగనున్నాయి. దీనికి సంభందించి శనివారం ఆలయ కమిటీ తేదీలను విడుదల చేసింది. ఈ మేరకు ఈనెల 8, 9, 10 తేదీల్లో మెరక తల్లి వారోత్సవాలు జరుగుతాయని ఈ వారోత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు హాజరవుతారని కమిటీ తెలిపింది.