RR: సాగులో నానో యూరియా, డీఏపీ వినియోగించడం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని ఏడీఏ శోభారాణి, ఏవో శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఆమనగల్లులో ‘ఆత్మ’ పథకం కింద రైతులకు నానో ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. సాంప్రదాయ ఎరువుల కంటే ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయని, ప్రస్తుత యాసంగి సాగులో వీటిని వినియోగించుకోవాలని సూచించారు.