Prabhas ‘స్పిరిట్’.. ‘అర్జున్ రెడ్డి’కి పది రెట్లు ఉంటుంది!
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి తెలిసింది. రా ఆఫీసర్‌గా చేస్తాడట.. అలాగే అర్జున్ రెడ్డి హీరో కన్నా 10 రెట్ల యాటిట్యూడ్ కలిగి ఉంటాడట.
Prabhas:ప్రస్తుతం.. ఆదిపురుష్ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. టీజర్‌తో ఆదిపురుష్‌కు జరిగిన డ్యామేజ్ అంతా ట్రైలర్‌తో కొట్టుకుపోయింది. ఎక్కడ చూసిన ఒకటే నినాదం ‘జై శ్రీరామ్’ మాత్రమే వినిపిస్తోంది. దాంతో జూన్ 16 థియేటర్లన్నీ రామమందిరంగా మారనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ గురించి ఓ అదిరిపోయే అప్డేట్ న్యూస్ వచ్చింది.
ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితో (Arjun Reddy) సంచలనం క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’తో సత్తా చాటాడు. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ యంగ్ టాలెంట్‌తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. యానిమల్ సినిమాతో సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ కానుంది.
ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో (Prabhas) స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు సందీప్. అసలు ప్రభాస్‌ను (Prabhas) ఈ బోల్డ్ డైరెక్టర్ ఎలా చూపిస్తాడనేది.. అనౌన్స్మెంట్ నుంచే ఎగ్జైటింగ్‌గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైన జానర్‌తో తెరకెక్కుతున్నాయి. ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించబోతున్నాడు డార్లింగ్. ఆదిపురుష్‌లో శ్రీరాముడిగా, సలార్‌లో రాక్షసుడిగా, ప్రాజెక్ట్ కెలో టైం ట్రావెలర్‌గా కనిపించబోతున్నాడు.
మారుతి సినిమాలో వింటేజ్ డార్లింగ్‌ను చూడబోతున్నాం. నెక్స్ట్ చేయబోయే స్పిరిట్ మూవీలో ‘రా’ క్యారెక్టర్ చేయబోతున్నాడట ప్రభాస్ (Prabhas). ఇదే విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి. ప్రస్తుతం సందీప్ యానిమల్తో పాటు.. స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సందీప్. ఈ సినిమాలో ప్రభాస్ యాటిట్యూడ్ ఓ రేంజ్లో ఉంటుందట. ఎంతలా అంటే.. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌కి పది రెట్లు ఎక్కువగా.. స్పిరిట్‌లో ప్రభాస్ (Prabhas) క్యారెక్టర్ ఉంటుందని అంటున్నాడు. దాంతో స్పిరిట్ పై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి స్పిరిట్ ఎలా ఉంటుందో చూడాలి.