»A Wedding Gown Designed With 50890 Crystals Is Included In The Guinness World Record
Guinness World Record లోకి పెళ్లి గౌను.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
పెళ్లికి వేసుకునే గౌను అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓ అమ్మాయి మాత్రం క్రిస్టల్స్ ఉపయోగించి.. డిజైన్ చేసుకుంది. అదీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
A wedding gown designed with 50,890 crystals is included in the Guinness World Record
Guinness World Record:వెడ్డింగ్ డ్రెస్ అనేది చాలా ప్రత్యేకమైనది. స్పెషల్ గా డిజైన్ చేసుకుంటారు. ఓ అమ్మాయి వెడ్డింగ్ గౌన్ అయితే ఏకంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Guinness World Record)చేరింది. ఆ గౌను ప్రత్యేకత ఏంటి? తెలుసుకుందాం పదండి.
దుస్తులు, నగలు ఇష్టపడని అతివలు ఎవరు ఉంటారు చెప్పండి. అలంకరణ అమ్మాయిలకు మరింత అందాన్ని తీసుకువస్తుంది. అంత ఇష్టంగా ధరించే దుస్తులను ఆభరణాలతో డిజైన్ చేస్తే ఇంక ఎంత అద్భుతంగా ఉంటుంది. ఓ యువతి క్రిస్టల్స్‌తో తన పెళ్లి దుస్తులు డిజైన్ చేయించుకుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది.
ఈ వెడ్డింగ్ గౌను ప్రత్యేకత ఏంటంటే.. 50,890 క్రిస్టల్స్‌ని (crystals) ఉపయోగించి డ్రెస్‌ను తయారు చేశారు. చేతి స్లీవ్స్ కూడా స్ఫటికాలతో అలంకరించారు. వైట్ కలర్ వెడ్డింగ్ గౌన్లు చూడటానికి అద్భుతంగా ఉంది.
దుస్తులను ఇటాలియన్ బ్రైడల్ ఫ్యాషన్ బ్రాండ్ డిజైన్ చేశారు. మైఖేలా ఫెర్రెరో ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. ఈ డ్రెస్ తయారు చేయడానికి నాలుగు నెలల సమయం పట్టిందని తెలిసింది. పెళ్లి రోజున మోడల్ మార్చే గెలానీ కావ్-అల్కాంటే ఈ దుస్తులను ధరించింది.
ప్రస్తుతం ఈ ఆకర్షణీయమైన గౌను గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ వస్త్రం ప్రత్యేకతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు.
గతంలో రికార్డు ఓజ్డెన్ గెలిన్లిక్ మోడా తసరిమ్ లిమిటెడ్ (టర్కీ) పేరుతో ఉంది. 45,024 క్రిస్టల్‌తో టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫోరమ్ ఇస్తాంబుల్ షాపింగ్ మాల్లో 29 జనవరి 2011న ప్రదర్శించారు.