3 Titles:సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu), దర్శక ధీరుడు రాజమౌళి (Raja mouli) కాంబినేషన్లో రానున్న ప్రాజెక్ట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్ హల్చల్ చేశాయి. లేటెస్ట్ అప్టేడ్ ప్రకారం.. ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ బాబు (mahesh babu) నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28కి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ‘అమరావతికి అటు ఇటు’గా అనే టైటిల్‌నే దాదాపుగా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా.. ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఆరోజే రానుంది. ఇప్పటికే ఈ విషయంలో మేకర్స్ కొంత క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు రాజమౌళి (Raja mouli) సినిమాకు పంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. గతంలో ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న(Raja mouli) . ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ 29పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమా కోసం మూడు టైటిల్స్‌ని లాక్ చేసి.. అందులో ఒకటి ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ టైటిల్స్ ఏంటనేది తెలియకపోయినా.. హాలీవుడ్ రేంజ్ మూవీ కాబట్టి.. ‘అవతార్’ రేంజ్లో ఉండేలా.. యూనివర్సల్ టైటిల్‌ను అనుకుంటున్నారట.
ఓ మూడు టైటిల్స్‌ను రాజమౌళి తన ముందు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్స్ సంస్కృత పదాలు నుంచి తీసుకుంటున్నాడని అంటున్నారు. అన్ని కుదిరితే ఈ ఇయర్ మిడ్‌లో ప్రాజెక్ట్ మొదలు పెట్టి.. దసరాకి టైటిల్‌ను కూడా ప్రకటించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం మహేష్ బాబు (mahesh babu) సమ్మర్ వెకషన్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియాకు తిరిగి రాగానే ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా.. జనవరి 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఎస్ఎస్ఎంబీ 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.