»Father Who Tattooed Daughters Name 667 Guinness World Record
Guinness World Record: కూతురి పేరుని 667 టాటూలు వేసుకున్న తండ్రి.. వరల్డ్ రికార్డ్!
కూతురంటే ప్రతి తండ్రికీ ఎంతో ఇష్టం. వారి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కూతురి మీద ప్రేమ ఉండే ఓ తండ్రి తన బిడ్డపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకుని వరల్డ్ రికార్డు సాధించాడు. తన కూతురి పేరును 667 సార్లు టాటూలు వేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.
చాలా మంది తమకు ఇష్టమైన వారి పేరును పచ్చబొట్టుగా వేసుకుంటారు. తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు చేతిపై పచ్చబొట్టు వేసుకోవడం మామూలే. అయితే యూకేకి చెందిన 49 ఏళ్ల వ్యక్తి మార్క్ ఓవెన్ ఎవాన్స్ తన శరీరంపై కూతురి పేరును ఎక్కువ సార్లు టాటూ వేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అత్యధిక సార్లు టాటూ వేయించుకుని రికార్డు (World Record) సాధించాడు.
Mark Evans has dedicated his body to his daughter Lucy by getting her name tattooed 667 times.https://t.co/rBRXCHnFH2
ఓవెన్ ఎవాన్స్ 2017లో తన కూతురు లూసీ పేరును వీపుపై 267 సార్లు టాటూ వేయించుకోవడం విశేషం. అప్పట్లోనే అలా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. అయితే 2020లో యూఎస్ఏకి చెందిన 27 ఏళ్ల డైడ్రా విజిల్ 300 టాటూలు వేయించుకుని ఆయన రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో ఓవెన్ ఎవాన్స్ తన పాత రికార్డును తిరిగి సొంతం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
తన కూతురు లూసీ పేరును శరీరంపై మరో 400 టాటూలు వేయించుకున్నాడు. దీంతో మొత్తం కలిపి 667 టాటూలు వేసుకుని రికార్డు నెలకొల్పాడు. ఎవాన్స్ తన తొడలపై మొదటగా టాటూలు వేయించుకున్నాడు. ఒక్కో తొడపై 200 చొప్పున 400 టాటూలు వేసినందుకు అతను ఇద్దరు ఆర్టిస్టులను ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఆ టాటూలు వేసేందుకు దాదాపు ఐదున్నర గంటల సమయం పట్టింది. మొత్తానికి ఎవాన్స్ తన కూతురి పేరును టాటూలుగా వేసుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.