»Alia Bhatt In A Wedding Saree For The Awards Ceremony Netizens Comments
Alia Bhatt: అవార్డుల కార్యక్రమానికి పెళ్లి చీరలో అలియా భట్..నెటిజన్ల కామెంట్స్
ఢిల్లీలో 69వ సినిమా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న అలియా భట్(Alia Bhatt) తన పెళ్లి రోజు నాటి చీర(saree)ను ధరించడం పట్ల నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Alia Bhatt in a wedding saree for the awards ceremony Netizens comments
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) తన అందమైన పెళ్లి చీరలో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును స్వీకరించింది. తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి వచ్చిన అలియా గత సంవత్సరం తన పెళ్లి రోజున ఆమె ధరించిన చీరనే ధరించడానికి ఎంచుకుంది. ఆ క్రమంలో ఈ వేడుకలో ఆమె చిత్రాలు, అప్పటి పెళ్లి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలియా లుక్ ఆన్లైన్లో కనిపించిన కొద్దిసేపటికే X (గతంలో ట్విట్టర్)లోని గత వీడియోలు వైరల్‌గా మారాయి. ఆమె లుక్‌కి ప్రతిస్పందిస్తూ ఒక అభిమాని “ఆమె చాలా అద్భుతంగా కనిపిస్తోంది” అని పేర్కొన్నారు. మరొకరు ఇలా వ్రాశారు “అప్పట్లో ఇది చాలా ముఖ్యమైన రోజు. వృత్తిపరంగా ఈ రోజు కూడా చాలా ముఖ్యమైన రోజని మరొకరు వెల్లడించారు. గర్ల్ గోయింగ్ గుడ్ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు(comments). ఆమె చాలా విధాలుగా స్ఫూర్తిదాయకంగా ఉందని ఇలా పలువురు వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ఆ సున్నితమైన బంగారు ఎంబ్రాయిడరీని చీర(saree)ను డిజైన్ చేశారు. ఆ చీరలో అలియా ప్రకాశవంతంగా కనిపించింది. మరోవైపు రణ్ బీర్ కపూర్ కూడా క్లాస్ లుక్ లో ఉన్నారని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఆమె అవార్డును స్వీకరించినప్పుడు రణబీర్ తన మొబైల్లో ఫోటోలు తీయడం వీడియోలో చూడవచ్చు. అలియా భట్, రణబీర్ కపూర్ గత సంవత్సరం ఏప్రిల్ 14న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఆమె తన పెళ్లి రోజున బంగారు ఐవరీ చీరలో అద్భుతంగా కనిపించింది. అంతేకాదు ఆమె వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు చీర అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన వస్త్రమని, అందుకే తన పెళ్లికి లెహాంగాకు బదులు చీరను ధరించానని చెప్పుకొచ్చింది.