»Naga Vamsi Said No Change In The Release Date Of Leo Telugu Movie
Naga Vamsi: లియో విడుదల తేదీలో మార్పు లేదు
తలపతి విజయ్ రాబోయే చిత్రం లియో(leo) రిలీజ్ కోసం అనేక కష్టాలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే తమిళనాడులో ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదం రావడంతో కోర్టు ఈ చిత్రంపై స్టే ఇచ్చింది. ఈ క్రమంలో దీనిపై మరో అప్ డేట్ వచ్చింది.
Naga Vamsi said No change in the release date of Leo telugu movie
హైదరాబాద్ కోర్టు మంగళవారం సినిమా తెలుగు లియో(leo) వెర్షన్‌పై అక్టోబర్ 20 వరకు తాత్కాలిక నిషేధాన్ని జారీ చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా విడుదల తేదీ మారితే సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లపై గణనీయంగా ప్రభావం ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం లియో టైటిల్ తమ యాజమాన్యం అంటూ ఒకరు కోర్టులో పిటిషన్ వేయడంతో వివాదం మొదలైంది.
అయితే ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లో లియోని పంపిణీ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ(Naga Vamsi)స్పందించారు. అక్టోబర్ 19న అనుకున్న విధంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాను సజావుగా విడుదల చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగులో లియో టైటిల్ విషయంలో చిన్న పొరపాటు జరిగిందన్నారు. తమ టీమ్ అవతలి వారితో చర్చలు జరుపుతోందని, ఎలాంటి సమస్య లేకుండా అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లియో తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 19న విడుదల అవుతుందని నాగ వంశీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ హామీ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సినిమా థియేటర్లు లియో తమిళం, తెలుగు వెర్షన్ల కోసం బుకింగ్‌లను మళ్లీ తిరిగి ప్రారంభించాయి.