E.G: మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ ఎన్టీఆర్ పురస్కారాన్ని చిరంజీవికి అందించడం ఆనందదాయకమన్నారు. చిరంజీవి భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలన్నారు.