గల్ఫ్ దేశాల నుంచి 52,360 మందిని భారత్కు తరలించినట్లు DGCA తెలిపింది. భారత విమానయాన సంస్థలు 184 విమానాలు, UAE విమానయాన సంస్థలు 85 విమానాలు నడపగా, 11 ప్రత్యేక విమానాలు ఉపయోగించారు. UAEలో రెగ్యులర్ విమానాల షెడ్యూళ్లను రద్దు చేసినందున భారత విమానయాన సంస్థలు అందుబాటులోకి వచ్చిన స్లాట్లను బట్టి ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.