మాజీ రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని రాజ్ భవన్లో ఆవిష్కరించారు. అనంతరం ఆమె నారాయణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నారాయణన్ పాటించిన నిజాయితీ, దయ, ప్రజాస్వామ్య విలువలు గొప్పవని పొగిడారు. ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం తనకు చాలా గౌరవంగా ఉందని Xలో పేర్కొన్నారు.