NZB: మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుందని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు 2,658 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.