BPT: కారంచేడు మండలం తిమ్మిడితిపాడు గ్రామంలోని వాగును ఇవాళ ఎస్సై ఖాదర్ బాషా తన సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. వాహనదారులను అప్రమత్తం చేస్తూ వాగు దాటి రావద్దని సూచించారు. వాగు ఉధృతి తగ్గేవరకు ప్రజలు రాకపోకలు కొనసాగించవద్దని తెలియజేశారు. ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని ఆయన చెప్పారు.