»Aparna Das Onboard Panja Vaisshnavj Tejs Pvt04working Title As Vajra Kaleshwari Devi
Aparna Das: తెలుగు తెరకు మరో టాలెంటెడ్ బ్యూటీ..!
తమిళంలో మనోహరం, బీస్ట్ వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకొని ఇటీవల దాదా అనే సినిమాలో మెరిపించిన బ్యూటీ అపర్ణాదాస్ తెలుగులో మెరవనుంది. ఆమె మెగా కాంపౌండ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో జత కట్టనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అపర్ణదాస్ ని ఎంపిక చేశారు.
తమిళంలో మనోహరం, బీస్ట్ వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకొని ఇటీవల దాదా అనే సినిమాలో మెరిపించిన బ్యూటీ అపర్ణాదాస్ తెలుగులో మెరవనుంది. ఆమె మెగా కాంపౌండ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో జత కట్టనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అపర్ణదాస్ ని ఎంపిక చేశారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన అపర్ణ దాస్ తో పాటు, శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైష్ణవ్ కి ఇది నాలుగో సినిమా. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అవ్వగా, దానితో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు, ఆ తర్వాత తీసిన రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే తనను తాను హీరోగా నిలపడాలి అంటే, ఆయనకు ఈ హిట్ చాలా అవసరం. అందుకే ఆయన కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక అపర్ణా దాస్ విషయానికి వస్తే, ఈ మూవీలో ఆమె వజ్ర కాళేశ్వరి గా కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి చాలా కీలకమని చిత్ర బృందం చెబుతోంది. ఆమె వల్ల సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. కాగా, అపర్ణ నటించిన దాదా సినిమా ఇటీవల విడుదల కాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెళ్లి కి ముందే గర్భం దాల్చి, కన్నవారిని కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి పాత్రలో అపర్ణ చాలా బాగా నటించింది. ఆ సినిమాలో ఆమె నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు తెలుగులో కూడా అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఈ సినిమా కనుక హిట్ అయితే, ఇక తెలుగులో వరస ఆఫర్లు క్యూ కట్టడం గ్యారెంటీ. ఇక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్ది రోజుల్లొ విడుదల తేదీని ప్రకటించనున్నారు.