KRNL: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గ్రామానికి చేర్చాలని జనసేన కోడుమూరు నేత సంధ్య విక్రమ్ కుమార్ పిలుపునిచ్చారు. కర్నూలు మండలం పంచలింగాలలో రహమతుల్లా ఆధ్వర్యంలో ఆదివారం ‘కాఫీ విత్ కార్యకర్త’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జనసేన నాయకులు శివ, రంగస్వామి, కృష్ణ, రజిని, రామచంద్ర, రఫీ, చాంద్ భాషా, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.