ATP: తెలుగుతో పాటు నాలుగు భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత కలిశారు. విజయవాడలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, వందేమాతరం శ్రీనివాస్ కొద్దిసేపు ముచ్చటించారు.