ATP: తాడిపత్రి పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్ సమీప ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ముఖంపై సిమెంట్ దిమ్మతో బాది హతమార్చినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.