NLR: బుచ్చి పట్టణం మంగళ కట్ట కాలనీలో వర్షపు నీరు చేరింది. ప్రజలు బయటకు రావాలన్నా బురదలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ మంగళకట్ట కాలనీని డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి పరిశీలించారు. నీళ్లు వెళ్లేందుకు చర్యలు చేపడతామన్నారు. వీధిలైట్లు లేకపోవడంతో పాముల బెడద ఎక్కువగా ఉందని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సొంత ఖర్చుతో విధిలైట్లు వేయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.