MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్లో యాక్టింగ్ చేసి అర్హత పొందిన 12 మంది ఉద్యోగులకు బుధవారం పదోన్నతి పత్రాలు అందజేశారు. ప్రాజెక్టు అధికారి నరేందర్, ఇంజినీర్ వీరన్న, మేనేజర్ జయశంకర్ ఆధ్వర్యంలో పదోన్నతి పత్రాలను అందజేశారు. AITUC ఫిట్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కార్మికుల అభివృద్ధి, సంక్షేమానికి యూనియన్ కృషి చేస్తుందన్నారు.