Another 4 People Arrested In TSPSC Paper Leak Case
TSPSC Paper Leak:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Paper Leak) కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సిట్ (SIT) మరో నలుగురిని అరెస్ట్ చేసింది. ఏఈ, ఏఈఈ పేర్ కొనుగోలు చేసిన నలుగురిని అదుపులోకి తీసుకుంది. వీరు ప్రవీణ్ (Praveen) నుంచి పేపర్ కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. వీరితో కలిపి పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన వారి సంఖ్య 27కి చేరింది.
పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే సిట్ (SIT) స్టేటస్ రిపోర్ట్‌ను హైకోర్టుకు అందజేసింది. ఇటీవల మరోసారి విచారణ జరగగా.. జూన్ 5వ తేదీన స్టేటస్ రిపోర్ట్ (Status Report) అందజేయాలని స్పష్టంచేసింది. సిట్ (SIT) విచారణపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విచారణ నెమ్మదిగా సాగుతోందని అభిప్రాయపడింది.
పేపర్ లీక్ కేసులో సిట్ (SIT) దర్యాప్తు కీలక దశకు చేరింది. దీంతో సీబీఐకి కేసు అప్పగించలేమని పేర్కొంది. పేపర్ లీకేజీ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ (ED) కూడా విచారిస్తోన్న సంగతి తెలిసిందే.