PPM: సీతంపేట మండలం ఇప్పగూడ గ్రామం సమగ్ర అభివృద్ధితో ఆదర్శ ‘ముస్తాబు’ గ్రామంగా నిలిచిందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సవర సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. గిరిజనులు నాటు మందులు, ఆర్ఎంపీల జోలికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందాలని సూచించారు.