JGL: మల్యాల మండలం రాజారంకు చెందిన రాకేష్‌ను ఓ బాలుడు కత్తితో దాడిచేయడంతో తీవ్ర గాయాలైనట్లు ఎస్సై నరేష్ తెలిపారు. రాకేష్ రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటివద్దకు వెళ్లి ఇరువురు చర్చించుకుంటున్న క్రమంలో.. ఆ చర్చ కాస్త వాదనగా మారింది. దీంతో అక్కడే ఉన్న బాలుడు తన తండ్రిని తిడుతున్నాడని రాకేష్ పై దాడిచేసినట్లు కేసు నమోదు చేశామన్నారు