SRD: మండల కేంద్రమైన కంగ్టి మార్కెట్లో రెండు రకాల బంతి పూలకు భలే గిరాకీ ఉంది. నేడు దీపావళి పండుగ సందర్భంగా బంతిపూలకు గిరాకీ బాగా పెరిగింది. ప్రతి దుకాణం, హోటల్లో వ్యాపార సంస్థలు, ఇంటి గుమ్మాల పచ్చ తోరణం కోసం బంతి పూలను కొనుగోలు చేస్తున్నారు. కిలో ధర రూ. 80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. అదేవిధంగా చామంతి, గులాబీ, గుమ్మడికాయలుకూడా వికరిస్తున్నారు.