NZB: విద్యార్థులకు వండి పెట్టే భోజనంలో నాణ్యత లోపిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని వర్ని మండల ప్రత్యేక అధికారి మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్లో భాగంగా కోటయ్య క్యాంపులోని కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టోర్ రూమ్, తరగతి గదులను తనిఖీ చేశారు.