KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిల్లా గుట్ట సందర్శనకు వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తు ఖిల్లాపై జారి పడింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. కాగా, సమాచారం అందుకున్న 108 సిబ్బంది గుట్ట మీది నుంచి ఆమెను స్ట్రెచర్‌పై కిందకు తీసుకురావడానికి 3 గంటలకు పైగానే సమయం పట్టిందని తోటి సందర్శకులు తెలిపారు.