పల్నాడు: దాచేపల్లిలో STU మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎస్టీయూ రాష్ట్ర మహిళా కార్యదర్శి సుశీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకురాలు జీ.వీ. పద్మజ, మండల అధ్యక్షురాలు తోట అరుణ పాల్గొన్నారు.