NZB: బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలో ఆదివారం పశువైద్య, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలికుంటు టీకాలు వేశారు. పశువైద్యాధికారి డాక్టర్ గౌతమ్ రాజ్ పర్యవేక్షణలో మొత్తం 182 పశువులకు (ఆవులు, గేదెలకు) ఈ టీకాలు వేశారు. పాడి పశువుల సంరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో LSA ప్రవీణ్, ప్రణీత్ సహా పలువురు రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.