NTR: నందిగామ శివారులోని అనాసాగరం నుంచి బైపాస్ రమణ కాలనీకి వెళ్లే రహదారికి అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. రోడ్డు అద్వానంగా మారడంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు, అధికారుల స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణాలు సులభతరం అవుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.