సత్యసాయి: వివిధ కేసుల్లో నిందితులను పట్టించడంలో సహకరించిన వ్యక్తులను జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సన్మానించారు. ఓ మహిళ సొంత తమ్ముడు దొంగతనానికి పాల్పడటంతో పోలీసులకు పట్టించింది. అలాగే ఓ గ్రామ సర్పంచ్ కూడా నిందితుడిని పట్టించడంలో సహకరించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఇలా సహకరిస్తే నేరాలను సులభంగా నియంత్రించవచ్చని ఎస్పీ తెలిపారు.