AKP: సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ లక్ష్మీ అన్నారు. శనివారం అచ్యుతాపురంలో ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు హక్కులు రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మద్యం, డ్రగ్స్, అశ్లీల చిత్రాలు కారణంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు.