MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో శనివారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి సీతక్క చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేద ఆడ బిడ్డలకు ఈ పథకాలు ఓ వరమని ఆమె అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ కళ్యాణ్ తదితరులు ఉన్నారు.