NGKL: తెల్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల కిచెన్‌ను స్వయంగా పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం తాజా కూరగాయలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.