AP: వైద్య వృత్తి కేవలం సంపాదన కోసమే కాదని, అది సమాజం పట్ల బాధ్యతని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, 2020 బ్యాచ్ విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. వైద్యులు రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, సమాజ సేవలో ముందుండాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.