AP: గత వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అస్తవ్యస్తతను కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్ కమీషన్ల కక్కుర్తి వల్లే పోలవరం ప్రాజెక్ట్ గోదాట్లో కలిసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి మాజీ సీఎం విధానాలే కారణమని, నిబంధనల ఉల్లంఘనలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు.