GNTR: తెనాలి పురపాలక సంఘ మాజీ ఛైర్మన్, నటరాజ్ జ్యువెలర్స్ వ్యవస్థాపకులు దివంగత కొత్తమాసు తులసీదాసు సతీమణి శివలీల అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.