మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ ప్రకటించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తన అన్నయ్యకు ఈ గౌరవం దక్కడం సంతోషకరమని, తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 2025 గద్దర్ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.