ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా పుష్పరాజ్ క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. దాంతో పుష్ప2 పై ఎక్కడ లేని అంచనాలున్నాయి. అలాంటి పుష్పరాజ్‌ను హీరోయిన్ రష్మిక టెన్షన్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. పుష్ప సినిమాలో డీ గ్లామర్‌గా శ్రీవల్లి పాత్రలో అదరగొట్టడంతో..
పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది రష్మిక. దాంతో తనకు బ్రేక్ ఇచ్చిన సొంత కన్నడ ఇండస్ట్రీని చులకన చేస్తోందనే వాదన రోజు రోజుకి ముదురుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ గురించి చెబుతూ.. ఆ సంస్థ పేరును ప్రస్తావించలేదు రష్మిక. అలాగే రెండు చేతులతో ‘సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్’ అనే అర్థమొచ్చేలా సైగలు చేస్తూ చెప్పింది.
ఇక అంతకు ముందు కాంతార మూవీ పై కూడా కాంట్రవర్శీ చేసింది. దాంతో కన్నడ సినీ ప్రేక్షకులకు ఆమై పై మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్గా కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా ఆమెకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దాంతో ఈ వివాదం మరింత ముదిరినట్టే కనిపిస్తోంది.
అమ్మడి తీరుకు కన్నడ ఇండస్ట్రీ వర్గాలు ఆమెను బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు.. ఏకంగా రష్మికను బ్యాన్ చేసినట్టు ప్రకటించాడు. ఒకవేళ అదే జరిగితే ఆమె అప్ కమింగ్ చిత్రాలకు కన్నడలో భారీ నష్టం తప్పదంటున్నారు. మరి ఇప్పటికైనా రష్మిక ఈ వివదానికి ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.