ADB: ఇచ్చోడ మండలంలోని దుబార్ పేట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం, పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు.