MBNR: బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లిలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు కృష్ణయ్య కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లగా, అదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై లెనిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.