NGKL: తెల్కపల్లి మండలం లక్నారంలో జరుగుతున్న ఎల్లమ్మ తల్లి పండుగ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. దుళ్ల వంశీయుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో దుళ్ల వంశస్తులు మాజీ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించి గౌరవించారు.