ADB: మార్చి నెలలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 38.6 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.