ELR: నూజివీడులోని డాక్టర్ ఎంఆర్ అప్పారావు కాలనీలో శనివారం నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో 31 వాహనాలను సీజ్ చేసినట్లు DSP ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో గంజాయి మొక్క పెంచుతున్న ఓ మహిళపై, ఎక్సైజ్ చట్టం కింద మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఈ సోదాలు చేపట్టినట్లు వివరించారు.