అల్లరి నరేష్, మిర్నా మేనన్ యాక్ట్ చేసిన ఉగ్రం మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(Ugram Movie Twitter Review)ను ఇప్పుడు చుద్దాం.
టాలీవుడ్(Tollywood) హీరో అల్లరి నరేష్(Allari Naresh) వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈరోజు(మే 5న) ఉగ్రం సినిమా(Ugram Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో నాంది సినిమా(Naandi Movie) చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala)తోనే ఇప్పుడు ఉగ్రం సినిమా చేయడం విశేషం. ఈ చిత్రంలో నరేష్ సరసన మిర్నా మేనన్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. అయితే ఈ చిత్రాన్ని ప్రిమీయర్ షోల ద్వారా చూసిన ప్రేక్షకులు మూవీ గురించి ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. మూవీ ఎలా ఉందో..వారి అభిప్రాయం ఎంటో ఇప్పుడు చుద్దాం.
ఉగ్రం మూవీలో ఫస్టాఫ్ కొంచెం డల్ గా ఉందని అంటున్నారు. ఒక సాధారణ పోలీసు డ్రామాతోపాటు రొమాంటిక్ ట్రాక్, బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్సెన్సులు ఉన్నాయని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ లో అతని కుటుంబంలోని మిస్టరీ ఎలిమెంట్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ద్వారా మిస్టరీని ఛేదించే ట్విస్ట్‌తో సెకండాఫ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మొత్తంగా అల్లరి నరేష్ క్లైమాక్స్ పోర్షన్స్‌లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారో ఈ ట్వీట్లను ఓ సారి చూసేయండి మరి.
#Ugram A Mystery Thriller that had an interesting storyline and good setup but falters in terms of execution for the most part. There were a few good sequences that worked but unnecessary commercial elements and dull writing ruin the flow in places. Mediocre!
Slow into proceedings in 1 half with good interval sequence makes it decent, 2 nd half deep into story of solving the mystery with twist through engaging screenplay, makes it better 2 nd half@allarinaresh acting👌💥, kid character❤️, fights – cinematography – Bgm🔥