»Congress Promises New Hanuman Temples Across Karnataka
New Hanuman temples రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తాం.. భజరంగ్ దళ్ నిరసనలతో కాంగ్రెస్ కొత్త అస్త్రం
భజరంగ్ దళ్ ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా హనుమాన్ ఆలయాలను నిర్మిస్తామని డీకే శివకుమార్ ప్రకటించారు.
Congress promises new Hanuman temples across Karnataka
New Hanuman temples:కర్ణాటకలో (karnataka) అధికారంలోకి వస్తే భజరంగ్ దళ్ (Bajrang Dal) నిషేధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చింది. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. దీంతో కాంగ్రెస్ హై కమాండ్ దిగి వచ్చింది. అబ్బే తమ ఉద్దేశం అదీ కాదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (dk shivakumar) కొత్త హామీ ఇచ్చి.. గొడవను చల్లార్చే ప్రయత్నం చేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్త హనుమాన్ ఆలయాలు (hanuman temple) నిర్మిస్తామని డీకే శివకుమార్ (dk shivakumar) ప్రకటించారు. కొత్త ఆలయాలను నిర్మిస్తామని. .అందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. భజరంగ్ దళ్ బ్యాన్ చేస్తామనే ప్రకటనతో ఆ కార్యకర్తలు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇదీ తమకు ప్రతికూలంగా మారుతుందని.. కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
అంతకుముందు మాత్రం విద్వేషం వ్యాపింపజేసే సంస్థలపై నిషేధం విధిస్తామని పేర్కొంది. భజరంగ్ దళ్తోపాటు పీఎఫ్ఐపై బ్యాన్ తప్పదని తేల్చిచెప్పింది. దీనిపై ఇంటా బయటా విమర్శలు రావడంతో తలొగ్గింది. కర్ణాటలో ఈ నెల 10వ తేదీన ఓకే విడతలో ఎన్నిక జరగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.