పంజాబీ నటి సోనమ్ బజ్వా ముద్దు సీన్లపై సంచలన కామెంట్స్ చేసింది. ‘ముద్దు సీన్లు ఉన్నాయని కొన్ని హిందీ సినిమాల్లో నటించలేదు. ఒకవేళ కిస్ సీన్లలో యాక్ట్ చేస్తే పంజాబీ ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా? అని ఆలోచించా. ఓసారి ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు వివరించగా.. సినిమా కోసమే కదా అలా చేసేది. దాని వల్ల సమస్య ఏంటన్నారు. దీంతో నాకు భారం తగ్గినట్లైంది’ అని తెలిపింది.