కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై చంటిబాబు ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించి, సద్వర్తనతో జీవించాల్సిందిగా సూచించారు. రౌడీ షీటర్లు సమాజంలో మంచి పౌరులుగా మారేందుకు పోలీసు శాఖ సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.