»Why A Special Invitation From Pm Modi To Megastar Chiranjeevi 2023
Chiranjeevi:ని పీఎం మోదీ ఎందుకు పిలిచినట్టు!?
రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్థానం అందిరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సొంత పార్టీ పెట్టారు చిరంజీవి. కానీ మెగాస్టార్ అయినంత మాత్రాన.. ఓట్లు పడతాయనుకుంటే పొరపాటే. చిరంజీవి విషయంలో ఇదే విషయం క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేశారు. ప్రస్తుతం సినిమా రంగంపైనే దృష్టిపెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా చిరు రాజకీయంగా వాడి వేడిగా వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. తాజాగా పీఎం మోదీ.. చిరుని ప్రత్యకంగా ఆహ్వానించాడని తెలియడంతో.. మరోసారి మెగా పొలిటికల్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇప్పటికే అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లి టైమ్ వేస్ట్ చేశానని.. దానికి భారీ మూల్యం చెల్లించుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు మెగాస్టార్(chiranjeevi). కానీ రాజకీయం మాత్రం తనని ఇప్పట్లో వదిలేలా లేదు. గాడ్ ఫాదర్ సినిమాలో.. తాను రాజకీయాల నుంచి దూరమయ్యాను.. కానీ తన నుంచి రాజకీయం దూరం కాలేదని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు చిరంజీవి. అప్పటి నుంచి మళ్లీ మెగాస్టార్ పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందనే టాక్ నడుస్తోంది.
అయితే సొంత పార్టీ ప్రజారాజ్యం నుంచి దూరమయ్యాక.. సొంత తమ్ముడు పవర్ స్టార్ సొంతంగా జనసేన(janasena) పార్టీని స్థాపించాడు. ప్రస్తుతం ఏపిలో జనసేనను నిలబెట్టేందుకు పవర్ స్టార్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ మరో వైపు మెగాస్టార్ కోసం కమల దళం గట్టిగా ట్రై చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రధాని మోదీ(PM Modi).. చిరంజీవిని ప్రత్యేకంగా కలవాలని ఆహ్వానం పంపారని ప్రచారం సాగుతోంది.
మే 10న కర్నాటక ఎలక్షన్స్(karnataka elections) జరగునున్నాయి. ఆ ఎన్నికల తరువాత తప్పనిసరిగా తనను కలవాలని.. ప్రధాని మోదీ స్వయంగా చిరంజీవిని కోరినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది. అసలు మోదీ.. చిరుని ఎందుకు కలవాలనుకుంటున్నాడు? తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణ ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్(BRS)ను గద్దె దింపేందుకు గట్టిగా కసరత్తులు చేస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో చిరంజీవిని పూర్తిగా వాడుకునేందుకు BJP ప్రయత్నిస్తోందని అంటున్నారు. అయితే మోదీని చిరంజీవి కలిసిన తర్వాతే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.