Naga Chaitanya: అక్కినేని హీరోగా జోష్ సినిమా(Josh movie)తో గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య(Naga Chaitanya). తొలి సినిమా భారీ హైప్ తో వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీసు(Box Office) వద్ద బోల్తాకొట్టింది. ఏమాయ చేశావే(Ye Maaya Chesave) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్(HIT) కొట్టారు. ఈ సినిమాలో సమంత(Samantha)తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు నాగ చైతన్య. ఆ సినిమాలో వారిద్దరి మధ్య రొమాన్స్ బాగాపండింది. అదే వారి పెళ్లి(Marriage)కి దారి తీసింది. ఆ సినిమాలో సమంతతో లెక్కలేనన్ని కిస్ సీన్లు పండించారు చైతు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య తాజా చిత్రం కస్టడీ(Custody). మే 12న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతోంది. గత ఏడాది `థ్యాంక్యూ`(Thank you) మూవీతో ఫ్లాప్ చూసిన చైతు ఈ సినిమాతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు.
ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చైతు తమిళ యూట్యూబర్ ఇర్ఫాన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ట్రూత్ ఆర్ డేర్ ఆడారు. ఈ గేమ్ లో నాగ చైతన్య పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. సీక్రెట్ క్రష్ ఎవరని అడిగిన ప్రశ్నకు హాలీవుడ్ భామ మార్గట్ రోబీ అని ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు మీరు ఎంత మందిని కిస్ చేశారు..? మరో ప్రశ్న సంధించగా చైతూ దానికి ఊహించని సమాధానమిచ్చాడు. `నేను ఎంత మందిని కిస్ చేశానో నాకే తెలియదు. నా సినిమాల్లో చాలా కిస్ సీన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు లెక్క పెట్టలేదు. మీరే లెక్కపెట్టుకోండి` అంటూ బోల్డ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక `ఎప్పుడైనా కార్ లో మీ గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్నప్పుడు పట్టుబడ్డారా..?’ అని అడగగా.. `అనుకోకుండా ఒకసారి పోలీస్ చూశాడని అని నాగ చైతన్య(Naga Chaitanya) పేర్కొన్నాడు.
పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇందులో అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి(Arvind Swamy) విలన్ గా అలరించబోతున్నాడు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. అలాగే ప్రియమణి, శరత్‌కుమార్, ప్రేమి విశ్వనాధ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మే 5న కస్టడీ(Custody) ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.