SRCL: విధి నిర్వహణలో మరణించిన గ్రామపంచాయతీ కార్మికుని కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. గంభీరావుపేట గ్రామపంచాయతీలో పనిచేస్తున్న రమేష్ నీటి పంపు రిపేరు చేయడానికి వెళ్లి మరణించాడన్నారు.