HYD: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పనులు 81 శాతం పూర్తయినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.25.93 కోట్లతో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని, ఎంట్రీ ర్యాంప్, దివ్యాంగుల సౌకర్యాలు, ఫూట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణపు పనులు ఇప్పటికే పూర్తయినట్లుగా వివరించారు. రాబోయే కొద్ది రోజుల్లో మొత్తం రైల్వే స్టేషన్ సిద్ధం చేయడానికి చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు.